వరదల్లో చంద్రబాబు పడిన కష్టం మామూలు కష్టం కాదు. అధికార యంత్రాంగంలో మందకోడితనం వచ్చేసింది. మందకోడిగా ఉన్న అధికారులను అంకుశం పెట్టి పొడవాల్సి ఉంది. కానీ వరదల్లో కష్టపడుతున్న చంద్రబాబు ను విమర్శిస్తుంటే బాధేస్తోంది అని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో అధికారం కూటమిదైనా.. స్థానిక సంస్థల్లో వైసీపీ వాళ్లదే అధికారం కదా.. కానీ వరదల సమయంలో విజయవాడ మేయర్ ఏమైపోయారు అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
అలాగే అధినేత ఎలా ఉండాలో దేశానికి చూపారు చంద్రబాబు. మాటలు పడడం చంద్రబాబుకు కొత్త కాదు. 100 రోజుల్లో పీఆర్ అండ్ ఆర్డీ శాఖలో కూడా ప్రగతి సాధించాం. పంచాయతీలను బలోపేతం చేయగలిగాం. మొత్తం అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించగలిగాం. మన పార్టీలు వేరైనా.. మనం వేర్వేరు కాదు. మూడు విభిన్నమైన పార్టీలు.. కానీ ఆత్మ ఒకటే. మూడు పార్టీల గుండెచప్పుడు ఒకటే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.