నేడు పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా 12 వేలు మంది మహిళలకు చీరలు కానుక గా పంపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సరస్వతి దేవి మందిరము, చండి హోమం జరిగే ప్రాంతం లోను బ్యాచ్ లు గా వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలోనే… 12 వేలు మంది మహిళలకు చీరలు కానుక గా పంపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఇలా ఉండగా… నేడు పలనాడు జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఈ సందర్భంగా నరసరావుపేట మండలం, కాకాని లో జేఎన్టీయూ కళాశాలలో, వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం 10:30 గంటలకు జేఎన్టీయూ ప్రాంగణానికి చేరుకుని, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటనున్నారు. జేఎన్టీయూ ప్రాంగణంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది జిల్లా పోలీసు యంత్రాంగం.