ఏటా నోటిఫికేషన్, వ్యాపారం పెట్టేందుకు రూ.10 లక్షలు : పవన్ కళ్యాణ్

-

జనసేన పార్టీ అధికారంలోకి వస్తే యువతకు పెద్దపీట వేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. ఏడాదికి లక్ష చొప్పున ప్రతి నియోజకవర్గానికి 500 మంది యువతను గుర్తించి, వారికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. వాళ్లు చిన్నచిన్న పరిశ్రమలు పెట్టేలా ప్రోత్సహిస్తామన్నారు.

నా కంటే ప్రభాస్, మహేష్ బాబు చాలా పెద్ద హీరోలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. నిన్న వారాహి యాత్రలో భాగంగా ముమ్మడివరం సభలో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ..ప్రభాస్‌, మహేష్ నాకంటే పెద్ద హీరోలు. ప్రభాస్ పాన్ ఇండియా హీరో.. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారని తెలిపారు.రాంచరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారన్నారు పవన్‌ కల్యాణ్‌. నేను వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో తెలియకపోవచ్చు, కానీ వారు తెలుసు.. రాష్ట్ర క్షేమం కోసం అందరి హీరోల అభిమానులు నాకు, జనసేనకు అండగా నిలబడండి, మీ హీరోలను అభిమానించండని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news