టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతోన్న పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి…ఏపీ పరిణామాలపై ప్రధాని మౌనంగా ఉండడంతో చాలా మంది మధనపడుతున్నారని ఆగ్రహించారు. తన చేతుల మీద శంకుస్థాపన జరిగిన అమరావతి ఆగిపోయిందని ప్రధాని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.మూడు రాజధానుల రాజకీయానికి ప్రధానే చెక్ చెప్పాలని అంతా భావిస్తున్నారని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే క్షణాల్లో అమరావతి సమస్య పరిష్కారం అవుతుంది.ఏపీలో పరిణామాలను బీజేపీ రాష్ట్ర శాఖ ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంలో ఫెయిలైందన్నారు. తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో బీజేపీ రాష్ట్ర నేతలకు తెలుసు.మూడున్నరేళ్ల కాలంలో జరిగిన పరిణామాల్లో బీజేపీ పాత్రపై ప్రజల్లో బాధ ఉందని తెలిపారు. మూడు రాజధానులు ఓ డ్రామా అనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైంది…వైసీపీ డ్రామాలను ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు గుర్తించారన్నారు. వైసీపీ నిర్వహించిన విశాఖ గర్జన, రాయల సీమ ఆత్మగౌరవ సభ ఫెయిలయ్యాయి.కూల్చివేతలతో సీఎం జగన్ పాలన మొదలు పెట్టారు.. ఒక్కటైనా కట్టారా..?విభజన రాజకీయంతో నష్టపోయిన ఏపీలో వైసీపీ మళ్లీ విభజన రాజకీయం చేస్తోందన్నారు.