పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ

-

కృష్ణాజిల్లా : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలకు పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలింది. గుడివాడలో జి 3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో ఇవాళ మంత్రి కొడాలి నాని,పేర్ని నాని పాల్గొన్నారు. అయితే.. ఈ థియేటర్లో ప్రారంభ చిత్రంగా భీమ్లా నాయక్ మూవీని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే.. థియేటర్ వద్ద మంత్రి పేర్ని నాని, కొడాలి నానిని అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు ప్రయత్నించారు.

అంతేకాదు.. జై పవన్ కళ్యాణ్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు. దీంతో గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ , పలువురు అభిమానులను అరెస్ట్ చేశారు పోలీసులు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను వేధించడం దుర్మార్గమంటున్నారు అభిమానులు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను అరెస్టు చేయడం అన్యాయం అని జనసేన పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news