రామోజీరావు తెలుగువాడైనందుకు గర్వించాలి – వైసీపీ ఎంపీ

-

రామోజీరావు తెలుగువాడైనందుకు గర్వించాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. ఈనాడు సంస్థల అధినేత, రామోజీ ఫిలిం సిటీ సృష్టికర్త, దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న రామోజీరావు గారు తెలుగువాడు అయినందుకు గర్వించాలని పేర్కొన్నారు. 60 ఏళ్ల పాటు మార్గదర్శి సంస్థను నిర్విఘ్నంగా నిర్వహించడమే కాకుండా, సృష్టికి ప్రతి సృష్టి అన్నట్లుగా రామోజీ ఫిలిం సిటీని ఎటువంటి లాభా పేక్ష లేకుండా అద్భుతంగా నిర్మించారని అన్నారు.

ఈనాడు దినపత్రిక ద్వారా తెలుగు భాషను సుసంపన్నం చేశారని, అటువంటి రామోజీరావు గారిని అభినందించాల్సింది పోయి, పైకి చిరునవ్వులు చిందిస్తూ లోపల విషయాన్ని నింపుకొని వేధించడం దుర్మార్గమని రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు. మార్గదర్శి సంస్థపై అక్రమ కేసులను నమోదు చేస్తున్న సీఐడీ పోలీసులు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తలకిందులుగా తపస్సు చేసినా ఒక్క చందాదారుడి నుంచి కూడా ఆ సంస్థపై ఫిర్యాదును స్వీకరించలేకపోయారని తెలిపారు. మార్గదర్శి సంస్థ చిట్టిలను నిర్వహిస్తుందని, ఆ చిట్టిలను నిర్వహించినందుకు 5 శాతం కమీషన్ తీసుకుని, తన వ్యాపార కార్యకలాపాలను చేపడుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version