వైసీపీ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమికి జగనే కారణం అంటూ బాంబ్ పేల్చారు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. కోటరీ కాదు.. వైఎస్ జగనే కారణమన్నారు.
జగన్ ఎవరి మాట వినరని తెలిపారు. పొగడకపోతే అక్కడ స్థానం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఆరు నెలలకొకసారి జగన్ అపాయింట్ మెంట్ వస్తుందని…కొందరికి ఆ అవకాశం కూడా ఉండదని కూడా ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.