విలీన మండలాల్లో పెరుగుతున్న వరద నీటిమట్టం

-

అల్లూరి జిల్లా లోనీ విలీన మండలాల్లో మరింతగా పెరుగుతున్న వరద నీటిమట్టం.కూనవరం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న గోదావరి – శబరి నదులు. కూనవరం వద్ద 47 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం. చింతూరు వద్ద 50 అడుగులు దాటి ప్రవహిస్తున్న శబరి నది. కూనవరం (మం) పోలిపాక వద్ద మరియు ఎటపాక (మం) నెల్లిపాక వద్ద రహదారి పై ప్రవహిస్తున్న వరద నీరు. దీంతో తెలంగాణ – ఆంధ్ర రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్.

చింతూరు వద్ద జాతీయ రహదారి 30 పైకి చేరిన వరద నీరు.దీంతో ఆంధ్ర – ఛత్తీస్ గడ్ – ఒడిశా రాష్ట్రాలకు నిలిచిపోయిన రవాణా. వరద నీరు పెరగడంతో విలీన మండలాల్లో పొంగి పొర్లుతున్న సోకిలేరు వాగు,అత్తా కొడళ్ళ వాగు, కొండరాజుపేట వాగు,అన్నవరం వాగులు.వందల సంఖ్యలో గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు.వరద బాధితులను సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు అప్రమత్తమౌతున్న అధికారులు.

మర పడవలు ఏర్పాటు చేసుకుంటున్న పోలీసు సిబ్బంది. వరదపై ముందస్తు సమాచారంతో పాటు ఇప్పటివరకు తమకు ఎలాంటి నిత్యావసర వస్తువులను అందజేయలేదని రెవెన్యూ సిబ్బందిపై బాధితుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కేవలం 15 రోజులలోపే రెండవసారి వరదలు రావడంతో బెంబేలెత్తుతున్న పోలవరం నిర్వాసితులు.

Read more RELATED
Recommended to you

Latest news