చంద్రబాబు నాయుడును జైల్లో ఉంచడంతో పాటు, రామోజీరావు గారిని, నారా లోకేష్ గారిని అరెస్టు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దల ఆశీస్సులు తీసుకొని తెలంగాణతో పాటే, డిసెంబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ముందస్తు ఎన్నికలకు వెళితే జగన్ మోహన్ రెడ్డి గారు ముందే అధికారం నుంచి దిగిపోతారని వెల్లడించారు.
సమయానుకూలంగా ఎన్నికలు జరిగితే కొన్ని రోజులైనా ఎక్కువ అధికారంలో ఉంటారని, అంతే తప్పితే మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లేదని, ఈ విషయాన్ని కొంత మంది అధికారులు గుర్తు పెట్టుకుంటే మంచిదని, ఇప్పటికీ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా నడుచుకుంటున్న వారికి భవిష్యత్తులో తిప్పలు తప్పవని రఘురామకృష్ణ రాజు హెచ్చరించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం కేసులోలో చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా లబ్ధి పొందినట్లుగా ఆధారాలు ఉన్నాయా అని హైకోర్టు న్యాయమూర్తి గారు సీఐడీ పోలీసులను ప్రశ్నించారని వెల్లడించారు రఘురామ.