ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ మండలం పెద్ద తామరపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కల్వర్టును ఢీకొనడంతో బస్సులో ఉన్న 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణిస్తుండగా.. 21 మందికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు.

వీళ్లంతా బెంగాల్ నుంచి కేరళ వెళుతున్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని స్థానికులు టెక్కలి లోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన వారిని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ స్పృహలోకి వస్తే అసలు ఏం జరిగిందనే దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.