ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు – టిడిపి పోలీట్ బ్యూరో సభ్యురాలు

-

వైసిపి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టిడిపి పొలిటి బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి. వైసిపి ప్రభుత్వం సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలా మార్చేసిందంటూ మండిపడ్డారు. సర్పంచ్ల నిధులను వెనక్కి లాగేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సొంత డబ్బులతో గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. దేశంలో చెక్ పవర్ ఉన్న ఏకైక రాజకీయ వ్యక్తి సర్పంచ్ ఒక్కరేనని.. అలాంటి గ్రామ సర్పంచ్ లకు వైసీపీ ప్రభుత్వంలో విలువ లేకుండా పోయిందన్నారు.

గ్రామ స్థాయిలో పెత్తనం అంతా గ్రామ వాలింటర్ చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు సర్పంచ్ దగ్గరకు కాకుండా వాలింటర్
ఇంటికి వెళ్లి అడుక్కునే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో నెలకొంది అన్నారు. వైసీపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇంతకు ముందు సర్పంచ్ లకు ఉన్న విలువ, మర్యాదలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ లకు ఇంకా స్వతంత్ర్యం రాలేదన్నారు. టీడీపీ సర్పంచ్ లకి కనీస ప్రాధాన్యత ఇవ్వకపోగా వైసీపీ వాళ్లే పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు.

14, 15 వ ఆర్ధిక సంఘం నిధులు ఎక్కడికి పోయాయో తెలీదన్నారు.రాత్రికి డబ్బులు పడ్డాయి… ఉదయానికి మాయమయ్యాయని ఎద్దేవా చేశారు. ఒక్క ముఖ్యమంత్రికి తప్పా ఇంకెవరికి పని కల్పించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైసీపీయేనని దుయ్యబట్టారు. ప్రజలు కోసం పోరాటాలు చేస్తున్న టీడీపీ వాళ్లపై కేసులు పెడుతున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news