‘లైగర్’ మేనియా షురూ.. జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్‌

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ ఈ నెల 25న విడుదల కానుంది. టాలీవుడ్ డేరిండ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ పిక్చర్ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషించారు.

మూవీ ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ సభ్యులు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ చిత్రం విడుదలకు ముందే ‘లైగర్’ మేనియా షురూ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా అవుతున్నాయి. ఈ నెల 20 నుంచే టికెట్స్ బుకింగ్స్ స్టార్ట్ కాగా, జనాలు టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.

‘లైగర్’ ..‘బింబిసార’, ‘సీతారామం’, ‘కార్తీకేయ-2’ ల విజయ పరంపరను కొనసాగిస్తుందని సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవర కొండ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ అయిపోతాడని అంటున్నారు. ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో నార్త్ లోనూ కొంత పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ ద్వారా ఇంకా ఆడియన్స్ కు దగ్గరవుతారని చెప్తున్నారు.

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యా పాండే ఇందులో హీరోయిన్ కాగా, రమ్యకృష్ణ.. విజయ్ దేవరకొండకు తల్లిగా నటించింది. ఇకపోతే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు రూ.రెండున్నర కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన రిలీజ్ కు ముందే రికార్డుల వేటలో ‘లైగర్’ పిక్చర్ తలమునకలైనట్లే. విజయ్ దేవరకొండ ఈ సారి ‘లైగర్’ ద్వారా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని సినీ ప్రియులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news