జగన్‌ మాములోడు కాదు…ఆయన ఆలోచనలు అంచనా వేయలేం – సోమువీర్రాజు

-

జగన్‌ మాములోడు కాదు…ఆయన ఆలోచనలు అంచనా వేయలేమంటూ బీజేపీ పార్టీ మాజీ చీఫ్‌ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అంచనాలు వేయడం కష్టమన్నారు. విశాఖ రాజధాని పేరు చెప్పి 500కోట్లతో బిల్డింగ్ కట్టుకున్నాడు తప్ప రాజధానికి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని కూడా చురకలు అంటించారు. ఈ పరిస్థితులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పారు.

somu veerraju comments on jagan

ప్రపంచ దేశాలను ఆ ఆకర్షిస్తున్న విశాఖలో ఫార్మ ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరగడం ఆందోళనకరమన్నారు. శ్రీకాకుళంలో విశాఖ కంటే ముందే ఫార్మా ఇండస్ట్రీలు ఏర్పాటు అయిన విశాఖలోని ఎందుకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పంచాయితీ నిధులను గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఘాతం కలిగించిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version