బూమ్ బూమ్ మందులు అమ్ముకోవడం తప్ప అభివృద్ధి ఆలోచనే లేదు – సోము వీర్రాజు

-

విశాఖలో జనసేన కార్యకర్తల అరెస్టుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. జనసేన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు. పోలీసులు అతి ఉత్సాహం ప్రవర్తించారని మండిపడ్డారు. విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన పది రోజుల ముందే ఖరారు అయిందని.. దీనిపై తనకు పూర్తి సమాచారం ఉందని చెప్పారు. పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిదని.. మరోసారి ఇటువంటివి పునరావృతం అయితే బిజెపి ముందుండి ప్రత్యక్షంగా పాల్గొంటుందని హెచ్చరించారు.

 

వైసిపికి వికేంద్రీకరణ అంటే ఏంటో అసలు తెలుసా? అని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పై వైసీపీ, టిడిపి లకు పాఠాలు చెప్పగలిగే పార్టీ బిజెపి ఒక్కటే అన్నారు. కండకావరం, అధికార దాహంతో ర్యాలీలు చేస్తారా? అని నిలదీశారు. బూమ్ బూమ్ మందులు అమ్ముకోవడం తప్ప అభివృద్ధి ఆలోచన మీకు ఎక్కడుందని సోము వీర్రాజు ఘాటుగా విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news