2024లో ఏపీలోని కుటుంబ పార్టీలను తరిమేస్తామని ప్రకటించారు సోము వీర్రాజు. విజయవాడలో ప్రజా పోరు పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ను ప్రారంభించారు సోము వీర్రాజు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు దాటింది రాష్ట్రంలో అభివృధి లేదని.. విజయవాడ ఆంధ్ర రాష్ట్రానికి రాజకీయాలను మలుపు తిప్పే సెంటర్ అన్నారు.
జగన్ సిఎం అయ్యాక ప్రజల్లో లేరు.. ఒక్క సారి కూడా సెక్రటేరియట్ కు వెల్లేదు.. అసెంబ్లీకి అప్పుడపుడు వెళ్తారు, అబద్ధాలు చెప్తారని ఆగ్రహించారు. ఇసుక సంవృద్దిగా వున్న తక్కువ ధరకు మాత్రం రాదు.. జగన్ ఒక అబద్ధాల కోరు… టిడిపి లో ఇసుక చౌక…. ప్రస్తుతం బంగారం కంటే అధిక ధర పలుకుతుందని విమర్శలు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ వుందని…. సిమెంట్ ధర పెంచారు… పసుపు కుంకుమ పేరుతో 35 వేల కోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు… రాజధాని మాత్రం కట్టలేదన్నారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు కట్టి మూడు రాజధానులు అంటాడని జగన్ పై మండిపడ్డారు.