2024 లో కచ్చితంగా ఏపీలో బిజెపి పాలన ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అనంతపురంలో సోము వీర్రాజు మాట్లాడుతూ…. రైతు భరోసా కేంద్రాలను దోపిడీ కేంద్రాలుగా ప్రభుత్వం మార్చేసిందన్నారు. రైతు కు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని… ఏపీలో బియ్యం ధరలు భారీగా పెరిగాయని ఆగ్రహించారు.
ఈ కారణంగా 10వేల కోట్ల ప్రజలపై భారమని.. జగన్ ప్రభుత్వం సామాన్య ప్రజలు, రైతులు ను దోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు. అవినీతి లో వైసీపీ ప్రభుత్వం కూరుకు పోయిందని… సమగ్ర శిక్షణ అభియాన్ లో భాగంగా 30వేల కోట్ల కేంద్రం నిధులను ఏపీ ప్రభుత్వం ఏమి చేసిందని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం ఇళ్ళు నిర్మాణం కోసం కొన్న భూములను కొనుగోలు లో ఎమ్మెల్యే లు కుంభకోణం అని.. తొమ్మిది సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో కచ్చితంగా ఏపీలో బిజెపి పాలన ఏర్పాటు చేస్తామన్నారు.