శ్రీలక్ష్మి కడిగిన ముత్యంలా బయటపడ్డారు – విజయసాయిరెడ్డి

-

ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టివేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీీ చేసింది. కాగా ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులోనే ఉన్నారు. 2004 నుండి 2009 వరకు శ్రీలక్ష్మి మైనింగ్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఆమెపై నేర ఆరోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు అందించలేకపోవడంతో కోర్టు ఆమెకి క్లీన్ ఇచ్చింది.

ysrcp mp vijayasai reddy
ysrcp mp vijayasai reddy

ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్ చీట్ రావడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ” ఒక అహంకార కేడి పోలీస్ అధికారి సహాయంతో దుర్మార్గపు పచ్చ కులమంద ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కేసుల్లో ఇరికించారు. ఇప్పుడు ఆమె అడిగిన ముత్యంలో బయటపడ్డారు. వందమంది దోషులు తప్పించుకున్న ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్న న్యాయ సూత్రాన్ని కాలరాశాడు ఆ కేడి పోలీసు”. అని ట్విట్ చేశారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news