ఆంధ్రప్రదేశ్ లో సోమవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారని ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు ఫెయిల్ కావడానికి వారి ఇంటిలో తల్లిదండ్రులే కారణమంటూ నెపం వేస్తారా? అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన పవన్ కళ్యాణ్ పలు డిమాండ్లను వినిపించారు. 10 గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఉచితంగా రీకౌంటింగ్ నిర్వహించాలని ఆయన కోరారు. రీకౌంటింగ్ కు ఎలాంటి ఫీజు వసూలు చేయరాదు అన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు వసూలు చేయరాదని పవన్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/HkzgjIX0SX
— JanaSena Party (@JanaSenaParty) June 8, 2022