పోలవరానికి డెడ్ లైన్ లేదు..ఎప్పుడు పూర్తి చేస్తామో డేట్ చెప్పాల్సిన అవసరం లేదు – అంబటి

-

పోలవరానికి డెడ్ లైన్ లేదు..ఎప్పుడు పూర్తి చేస్తామో డేట్ చెప్పాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. కుప్పం కూడా మా టార్గెట్‌లో ఉందని.. గత ఎన్నికల్లో మాకు 151 స్థానాలు వచ్చాయన్నారు. మేము చేసిన సంక్షేమం, అభివృద్ధితో 175 స్థానాలు సాధించగలుగుతామని.. కుప్పం మున్సిపాలిటీ సాధించామని పేర్కొన్నారు.

ఎమ్పీటీసీలు, జడ్పీటీసీలు సాధించిన తర్వాత లాజికల్ గానే కుప్పం టార్గెట్ అంటున్నామని.. సోది మహేశ్వర రావు నా మీద ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది?? అని ప్రశ్నించారు. నేను మంత్రి పదవికి రాజీనామా చేయాలని, నన్ను బర్తరఫ్ చేయాలని, అరెస్ట్ అవ్వాలని ఉమా కలలు కంటున్నాడని.. పోలవరానికి డెడ్ లైన్ లేదని తేల్చి చెప్పారు. దశల వారీగానే పోలవరం పనులు పూర్తి చేస్తామని.. 2019లో పూర్తి చేస్తామని డేట్ లు ఇచ్చిన వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? అన్నారు. డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయకుండా మిగిలిన పనులు ఎందుకు ప్రారంభించారో ఎందుకు సమాధానం చెప్పటం లేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news