వైఎస్ వివేకా హత్య, కోడి కత్తి కేసులకి బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ముద్దాయిలను కాపాడిన జగన్ ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. నిందితుల అరెస్టుపై సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నాలుగేళ్లు ముద్దాయిని కాపాడిన జగన్ అసెంబ్లీలో ఒక కన్ను.. మరో కన్ను అని వేదాంతం చెప్పి ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో ముద్దాయిల అరెస్టుపై జగన్ ఇప్పటికైనా నోరు తెరవాలన్నారు. సీఎం జగన్ ప్రత్యేక హోదా కోసం రాష్ట్రాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు దేవినేని ఉమ.