వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే విజయం అని పీలేరు సభలో చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా పీలేరులో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్ అధికార అహంభావాన్ని దించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధం అని చెప్పారు చంద్రబాబు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా దొంగల రాజ్యమే. జగన్ ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదు అన్నారు.
సీఎం జగన్ చాలా తెలివైన వాడు.. ఒక రాజకీయ వ్యాపారి. ఏపీకి ఒక్క పరిశ్రమను కూడా జగన్ తీసుకురాలేదు. ప్రజాకోర్టులో వైసీపీని శిక్షించే సమయం వచ్చింది. నేను కూడా రాయలసీమ బిడ్డనే. నాలో ఉండేది సీమ రక్తమే. అందుకే ఈ ప్రాంతాన్ని రతనాల సీమ చేయడానికే సాగునీటి కోసం 12,500 కోట్లు ఖర్చు చేశానని తెలిపారు. జగన్ సీమ కోసం ఏం చేశారో చెప్పాలి. వచ్చే కురుక్షేత్ర యుద్ధానికి మేము సిద్ధమే. సామాజిక న్యాయం చేశాడా తమ్ముళ్లు చేశాడా.. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. జగన్ మోహన్ రెడ్డిలో సామాజిక న్యాయం అంత ఉంటుందని తెలిపారు.