జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాల్సిందే – టీడీపీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానంపై పట్టు పట్టింది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ ఎమ్మెల్యేల వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది.

షెడ్యూల్ ప్రకారం ప్రశ్నోత్తరాలను ప్రారంభిచారు స్పీకర్ సీతారాం. వాయిదా తీర్మానం పై చర్చకు పట్టుబడుతూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు టీడీపీ సభ్యులు. అంతేకాదు… స్పీకర్ సీతారాం పై కాగితాలు చల్లారు టీడీపీ సభ్యులు. సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు చెప్పాలని పోడియం దగ్గర నినాదాలు చేశారు. అయితే.. టీడీపీ పార్టీ సభ్యులు సంయమనం పాటించాలని కోరారు స్పీకర్.