ఎడిట్ నోట్: సైకిల్ జోరు సాగేనా!

-

ఎన్నాళ్ళకు తెలుగుదేశం పార్టీకి అసలైన విజయం దక్కిందో..ఇంతకాలం వరుస ఓటములని చూసిన టి‌డి‌పికి..పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయనే చెప్పాలి. గత ఎన్నికల్లో దారుయమైన ఓటమిని టి‌డి‌పి మూటగట్టుకున్న విషయం తెలిసిందే. కేవలం 23 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ తర్వాత నుంచి ఏ దశలో కూడా వైసీపీకి పోటీ ఇవ్వలేని పరిస్తితి..ఇక వైసీపీ అధికార బలంతో వరుస విజయాలతో దూసుకెళుతుంది.

పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో 80 శాతం పైనే విజయాలు సొంతం చేసుకుంది. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక, బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచేసింది. అసలు ఏ ఎన్నికల్లో కూడా టి‌డి‌పి..వైసీపీకి పోటీ ఇచ్చిన పరిస్తితి కనిపించలేదు. ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా టి‌డి‌పి భారీ పరాజయాలని మొత్తగట్టుకుంది. దీంతో టి‌డి‌పి పని అయిపోయిందని వైసీపీ ప్రచారం చేస్తూ వచ్చింది. కానీ చంద్రబాబు ఎక్కడ వెనక్కి తగ్గకుండా పనిచేస్తూనే వచ్చారు..ప్రజల్లో తిరుగుతున్నారు..నేతలని తిప్పుతున్నారు. ఇలా తమ బలాన్ని పెంచుకుంటూ వస్తున్నారు.

ఇదే క్రమంలో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది..కానీ ప్రజలు ఆ వ్యతిరేకతని చూపలేని పరిస్తితి..దీంతో టి‌డి‌పికి ఛాన్స్ దక్కలేదు. కానీ పట్టభద్రులు వైసీపీపై వ్యతిరేకతని స్పష్టం చేశారు. ఇటు ఉత్తరాంధ్ర, అటు తూర్పు రాయలసీమ స్థానాల్లో టి‌డి‌పిని భారీ మెజారిటీతో గెలిపించారు. ఉత్తరాంధ్ర పరిధిలో శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలు ఉండగా తూర్పు రాయలసీమ పరిధిలో..ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.

ఈ స్థానాల్లోనే టి‌డి‌పి హవా నడిచింది. రెండు చోట్ల టి‌డి‌పి విజయాలు అందుకుంది. ఇక పశ్చిమ రాయలసీమ..కడప-కర్నూలు-అనంతపురం స్థానంలో టి‌డి‌పి..వైసీపీతో పోరాడుతుంది. అక్కడ రెండో ప్రాధాన్యత ఓటు లెక్కిస్తున్నారు. మరి అక్కడ ఫలితం ఎలా వస్తుందో చూడాలి. అయితే ఈ ఫలితాలు వైసీపీకి షాక్. టి‌డి‌పికి జోష్ ఇచ్చాయనే చెప్పాలి..సైకిల్ జోరు ఇలాగే కొనసాగుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news