జగనన్న ని కలిసే అవకాశం లేని ప్రజలకు.. “జగనన్నకి చెప్పుకోండి” అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు దాన్యం డబ్భులు చెల్లించడంలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ధాన్యం అమ్మి ఆరు నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడం దౌర్భాగ్యమన్నారు.
రూ.240 కోట్లు రైస్ మిల్లింగ్ చార్జీలు నెల్లూరులో ఇవ్వాలని తెలియజేశారు. రూ.39 కోట్లు రైతులకు ఇవ్వాలన్నారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ లో అవినీతి రూ. 900 కోట్లు వరకూ వెళ్ళిందని ఆరోపించారు సోమిరెడ్డి. ఈ స్కాం వెనక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. అప్పులపాలైన రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.
రూ. 900 కోట్ల పౌర సరఫరాల స్కాములో సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రం తెలంగాణను చూసి నేర్చుకోండని సూచించారు సోమిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యల్లో మూడు, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందన్నారు. పౌర సరఫరాల సంస్థలో జరిగిన కుంభకోణం నెల్లూరుకు మాత్రమే పరిమితమా.. రాష్ట్రం మొత్తం జరిగిందా అనే అనుమానం కలుగుతుంతోందన్నారు.