కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..13 మందికి గాయాలు

-

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా..13 మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో బొలేరో వాహనాన్ని ఐచర్..ఢీకొట్టింది.

ఇక ఈ ఘటనలో ఏకంగా ముగ్గురు మరణించారు. సంఘటన స్ధలంలో ఇద్దరు మృతి చెందగా .. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు హోళగుంద మండలం మల్లయ్య (హెబ్బటం) వీరయ్య ( కురుకుంద) ముత్తయ్య (కొత్తపేట) గా గుర్తించారు పోలీసులు. ఇక గాయపడిన 13 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అడవి పందుల వేటకు వెళ్తూ ప్రమాదం బారిన పడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version