విశాఖ సింహాచలం దేవాలయానికి కేంద్రంలో కీలక ప్రాధాన్యత దక్కింది. కేంద్ర టూరిజం శాఖ ప్రసాదం స్కీం కింద విశాఖ సింహాచలం దేవాలయం ఏంపిక చేసింది కేంద్రం. దేవాలయ అభివృద్దికి గానూ 53 కోట్ల రూపాయలు విడుదల చేయనుంది కేంద్రం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని, ఏపి టూరిజం శాఖకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై సింహచలం దేవస్థానం చైర్ పర్సన్ సంచయిత గజపతి మాట్లాడారు.
కేంద్ర టూరిజం శాఖ ప్రసాద్ స్కింలో విశాఖ సింహాచలం దేవాలయం చేర్చడం చాలా ఆనందంగా ఉందన్నారు ఆమె. దేశవ్యాప్తంగా ఐదు దేవాలయాలను గుర్తిస్తే, అందులో సింహాచలంను చేర్చినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఙతలు చెప్పారు ఆమె. మార్చ్ నెలల ఇదే విషయం పై కేంద్ర టూరిజం శాఖ మంత్రిని కలిసి ప్రాధాన్యతను వివరించానని ఆమె అన్నారు. నేను చేసిన కృషి ఫలించిందని… గతంలో కేంద్రమంత్రిగా ఉన్నా గత చైర్మన్ అంటూ (అశోక గజపతి రాజుని ఉద్దేశించి), చంద్రబాబు కూడ ఏం చేయలేకపోయారన్నారు.