‘గ్లోబల్‌ లీడర్‌’ అంటూ చంద్రబాబుపై విజయసాయి ట్వీట్‌ !

-

‘గ్లోబల్‌ లీడర్‌’ అంటూ చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణలో అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ లో 900 కిలోమీటర్ల తీరం ఉంది,’ ఇవీ నిన్న శ్రీకాకుళం జిల్లా రాజాం సభలో మాజీ సీఎం ఎన్‌.చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు. 2014లో ఉమ్మడి ఏపీ నుంచి విడదీసి తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు టీడీపీ అధినేతకు ఉన్న అవగాహన ఇదన్నారు.


దివంగత కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి తర్వాత ఆయన కన్నా ఎక్కువ కాలం ఉమ్మడి ఏపీని పరిపాలించిన తెలుగుదేశం అధ్యక్షుడు ఇలా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ అప్పటికి పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో అన్ని విధాలా అభివృద్ధి చెందిన మాట నిజమే గాని నవ్యాంధ్ర ప్రదేశ్‌ కు కేవలం 900 కి.మీ సముద్రతీరం మాత్రమే ఉందన్న చంద్రబాబు గారి ‘ఆర్థిక చైతన్యం’ ప్రఖ్యాత ఆర్థికవేత్తలను సైతం దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయరంగంలో సర్వతోముఖాభివృద్ధి సాంధించిన రాష్ట్రమని అందరికీ తెలుసని విమర్శలు చేశారు.

రాజాంలో ఆయన ఈ విషయం కూడా వెల్లడించారు. ‘గ్లోబల్‌ లీడర్‌’ అని అంతర్జాతీయ మీడియా నుంచి ‘ప్రశంసలు, పొగడ్తలు’ అందుకున్న నారా వారు ఇలాంటి అంచనాలు వేశారంటే…సైజు గణనీయంగా తగ్గిన కొత్త రాష్ట్రం ఏపీలో పరిపాలనపై, దాని అభివృద్ధిపై ఆయనకు ఉన్న అవగాహనరాహిత్యం ఎంతో మనకు అర్ధమౌతోంది. కొత్త రాష్ట్రంలో వస్తూత్పత్తి పరిశ్రమలు, సేవారంగం, ఆగ్రో ఇండస్ట్రీస్‌ వంటివి అనేకం ఏర్పాటు చేయకుండా కొత్త పోర్టుల ద్వారా విదేశాలతో వ్యాపారం పెంచేయాలని ఈ మాజీ ముఖ్యమంత్రి భావించడం కూడా ఆర్థికరంగ నిపుణులను గందరగోళపరిచేలా ఉంది. హైదారాబాద్‌ వంటి అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన నగరాన్ని కొద్దిగా విస్తరించి తానే ఉమ్మడి రాజధాని దేశంలోనే నంబర్‌ 1 స్థానానికి వెళ్లడానికి కారకుడయ్యానని ఇంకా గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఉన్న పెద్ద నగరం విశాఖపట్నాన్ని రాజధానిగా చేయలేదని ఫైర్‌ అయ్యారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news