పప్పూ…ఇంతకీ మీ పిన్నిగారిని ఎందుకు చంపేశావ్‌? – విజయసాయిరెడ్డి

నందమూరి ఎన్టీఆర్‌ కూతురు ఉమ మాహేశ్వరి మృతి ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఎన్టీఆర్‌ కూతురు ఉమ మాహేశ్వరిని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్‌ ప్లాన్‌ ప్రకారం హత్య చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వరుసగా విజయసాయిరెడ్డి ట్వీట్లు పెడుతున్నారు.

ఇక తాజాగా మరోసారి ఈ సంఘటనపై విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. పప్పూ…ఇంతకీ మీ పిన్నిగారిని ఎందుకు చంపేశావ్‌? అంటూ నారా లోకేష్‌ ఆరోపణలు గుప్పించారు విజయసాయి.

మరణించాక ఎన్టీఆర్‌ శవాన్ని లాక్కున్నారు! కోడెల శివప్రసాద్ కంటే ముందుగా ఆయన సెల్‌ ఫోన్‌కు అంత్యక్రియలు చేశారు! ఇప్పుడు…పప్పుగాడి పిన్ని గారు –చున్నీతో ఉరి వేసుకుందంటున్నారు! ఏం క్రిమినల్స్‌ ఫ్యామిలీరా బాబూ మీది! అంటూ సంచలన ఆరోపణలు చేశారు సాయిరెడ్డి. ఇంట్లో పార్థివదేహం పెట్టుకొని టీడీపీ జూం మీటింగ్ పెట్టడాన్ని సొంతపార్టీ నేతలే చంద్రబాబుని ఛీ కొడుతున్నారని చురకలు అంటించారు.