అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం పర్యటించాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఎల్లుండి నుంచి పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తామని అన్నారు. పోలవరం 135 అడుగులకు తగ్గిపోతే రాజశేఖరరెడ్డి చెప్పిన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. 27,28వ తేదీల్లో కలెక్టర్ల కార్యాలయాల వద్ద దీక్షలు నిర్వహిస్తామని.. ఢిల్లీ వరకూ ఈ ఉద్యమం తీసుకెళ్తామన్నారు.
రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని మీరెలా చెపుతారని వైసిపి పై మండిపడ్డారు. ఇక జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయకుండా రాహుల్ గాంధీ పై ఎలా అనర్హత వేటు వేస్తారని ప్రశ్నించారు రామకృష్ణ. ఎంపీలు స్వేచ్ఛగా రాష్ట్రపతిని కలిసే అవకాశాలు లేవన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నట్టుందని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన సెక్యులర్ పార్టీని కూడా కలుపుకుని వెళతామన్నారు. కాంగ్రెస్ చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు మద్దతిస్తున్నామని ప్రకటించారు. మోడీ స్నేహితుడు కాకపోతే అదానీ పై చర్యలు ఉండేవన్నారు. జగన్, అదానీ నాలుగు గంటలు ఏం మాట్లాడుకున్నారని ప్రశ్నించారు రామకృష్ణ. మోడీ ఆర్ధిక ప్రయోజనాలు అన్నీ అదానీతో ముడిపడి ఉన్నాయన్నారు. ఉపాధ్యాయ సంఘాల మధ్య సహకారం లేక వైసీపీ గెలిచిందన్నారు.