రెడ్‌ ఫుడ్‌ కలర్‌ ఎలా చేస్తారో తెలుసా..? ఇన్ని రోజులు వెజ్‌ అనుకున్నారుగా..!!

-

కలర్‌ను బట్టే మనకు ఆ ఫుడ్‌ మీద ఆకర్షణ పెరుగుతుంది. చిన్నపిల్లలు అయితే రంగురంగులగా ఉండే ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ఇక పెద్దవాళ్లు అయితే ఎర్రగా ఉండేవి తినడానికి ఇష్టపడతారు. బాగా ఎర్రగా ఉండే చికెన్‌పీస్‌లు, మటన్‌పీసులు చూస్తే నోరూరిపోతుంది. ఇక మంచురియా ఇలాంటివి కుడా..! స్పెసీఫుడ్స్‌ అని దాదాపు ఎర్రగానే ఉంటాయి.. ఇవి అంత రెడ్‌గా ఉండేందుకు వంటల్లో రెడ్‌ ఫుడ్‌ కలర్‌ వాడతారు. దీనివల్లే అవి అంత ఎర్రగా కనిపిస్తాయి.. ఇక్కడి వరకు బానే ఉంది.. అసలు ఈ రెడ్ కలర్‌ దేంతో చేస్తారో తెలుసా..? ఇలా ఈ కలర్స్‌ వాడటం మంచిదేనా.?

ఎరుపు రంగు ఎలా తయారు అవుతుందంటే..

రెడ్ ఫుడ్ కలర్‌ను కార్మైన్ అని కూడా పిలుస్తారు. ఎన్నో రెస్టారెంట్లలో కృత్రిమమైన ఎరుపు రంగునే వాడుతున్నారు.. ఈ ఎరుపు రంగు లాటిన్ అమెరికాకు చెందినది. అక్కడ కొచినియల్ అని పిలిచే ఎరుపు రంగు పురుగు ఉంటుంది. ఆ పురుగు నుంచి సారాన్ని తీస్తారు. ఆ సారంతో ఈ ఎరుపు రంగు ఫుడ్ కలర్ తయారుచేస్తారు. ఇందుకోసం లక్షల కొద్ది పురుగులను సేకరిస్తారు. ఉదాహరణకు ఒక పౌండ్ కృత్రిమ ఎరుపు రంగును తయారు చేయడానికి 70 వేల పురుగులు అవసరం పడతాయి. కాబట్టి ఆ రెడ్ ఫుడ్ కలర్ శాఖాహారమా? మాంసాహారమా అనేది ఇక మీరే ఆలోచించండి.

ఆరోగ్యానికి మంచిదేనా..?

2009లో కొచినియల్ పురుగుల నుంచి తయారు చేసే ఈ ఆహార రంగును సహజరంగుగానే పరిగణించడం మొదలుపెట్టారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాల ప్రకారం.. ఈ పురుగు నుంచి తయారు చేసే సారం తరచుగా వాడటం వల్ల ఆహార అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఫుడ్ కలర్స్‌కు దూరంగానే సహజ పద్ధతిలో ఇంట్లో ఉండుకుని తినడమే ఉత్తమం. రెడ్ ఫుడ్ కలర్ వాడిన ప్రతి ఆహార పదార్ధం మాంసాహారమే అని అర్థం చేసుకోవాలి.

రంగుల తయారీలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సహజంగా ఏర్పడేవి, రెండు కృత్రిమమైనవి. ఉదాహరణకు బీట్రూట్ నుంచి పింకు రంగును తయారు చేయవచ్చు. పసుపు రంగు పండ్లు, కూరగాయలు, పూల నుంచి… పసుపు రంగును తయారు చేయొచ్చు. అయితే ఎక్కువగా రసాయనాల మిశ్రమంతో తయారయ్యే కృత్రిమ రంగులే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర తక్కువగా ఉంటుంది. కృత్రిమ రసాయనాలు కలిపిన రంగులను వాడడం వల్ల డిప్రెషన్, అనేక రకాల క్యాన్సర్లు, పిల్లల్లో ఆటిజం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈరోజు బయటదొరికే ప్రతి ఫుడ్‌లో కృతిమ రంగునే వాడుతున్నారని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news