మొరిగే కుక్క కరవదు, చంద్రబాబు పరిస్థితి అదే… విజయసాయి సంచలన వ్యాఖ్యలు

-

చంద్రబాబు కామెంట్స్ అసభ్యకరంగా ఉన్నాయని… 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని విజయసాయి రెడ్డి హితవుల పలికారు. రాబోయే 25 ఏళ్లు చంద్రబాబు నాయుడికి అవకాశం లేదని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు ఊరికే గొప్పలు చెప్పుకుంటారని విమర్శించారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన అన్నారు. గత మూడేళ్ల కాలంలో విప్లవాత్మక పథకాలను వైఎస్సార్సీపీ తీసుకువచ్చిందని విజయసాయి అన్నారు. వైసీపీ ఎవరితోను పొత్తు పెట్టుకోదని… భవిష్యత్తులో పొత్తులు పెట్టుకునే అవకాశం లేదని ఆయన  అన్నారు. టీడీపీ ఎంత మందితో పొత్తు పెట్టుకున్నా మళ్లీ అధికారంలోకి వస్తామని విజయసాయి రెడ్డి అన్నారు. మొరిగే కుక్క కరవదని… చంద్రబాబు పరిస్థితి కూడా అదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 14 ఏళ్లలో సాధించలేదని… మరో అవకాశం ఇవ్వాలని కోరితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని విజయసాయి రెడ్డి విమర్శించారు. పారిశ్రామిక, సేవా, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం సమాంతరంగా డెవలప్మెంట్ జరుగుతుందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news