ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ ఈ బీసీ నేస్తం పథకం రెండో విడతలో భాగంగా ఈ నెల 12వ తేదీన అంటే ఇవాళ లబ్ధిదారులైన మహిళల ఖాతాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి 15 వేల చొప్పున జమ చేయనున్నారు.
బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య రెడ్డి, కమ్మ, కులాలకు చెందిన 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేద మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఈ కార్యక్రమం జరగనుంది.
కాగా గత ఏడాది ఈ పథకం కింద దాదాపు 4 లక్షల మంది మహిళల ఖాతాల లో ఏకంగా 590 కోట్లు జమ చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇక ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య మరింత గా పెరిగినట్లు స్పష్టం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పెరిగిన లబ్ధి దారులకు కూడా ఈ సారి డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపింది.