అన్నారం పంపులు మళ్లీ యథాతదంగా ప్రారంభం అయ్యాయి. కనీవినీ ఎరుగని వరదలతో నీట మునిగిన అన్నారం పంప్ హౌజ్.. కేవలం 45 రోజుల్లోనే తిరిగి పని ప్రారంభం అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
రికార్డు సమయంలో.. అన్నారం పంప్ హౌజ్ ను మళ్లీ సిద్ధం చేసిన ఇంజినీరింగ్ అధికారులను సీఎం కేసీఆర్.. మంత్రి హరీష్ రావు అభినందించారు. 500 ఏళ్లకు ఒకసారి వచ్చే స్థాయిలో గోదావరి ఈ సారి వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. అసాధారణ రీతిలో వర్షాలతో ఊహించని రీతిలో తలెత్తిన ఈ ప్రకృతి కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నెపల్లి, అన్నారం పంప్ హౌజ్ లు జూలై 14న పూర్తిగా నీట మునిగిన సంగతి తెలిసిందే.