క్రికెటర్ మిల్లర్‌ ఇంట విషాదం.. కేన్సర్‌తో క్రికెటర్ కుమార్తె మృతి

-

సఫారీ జట్టు ప్లేయర్‌ డేవిడ్‌ మిల్లర్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. అతడి గారాల పట్టి కేన్సర్‌ తో మరణించింది. మిల్లర్‌ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మై లిటిల్‌ రాక్‌ స్టార్‌.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా అంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు మిల్లర్‌.

కాగా.. మిల్లర్‌.. మై లిటిల్‌ రాక్‌ స్టార్‌ అని సంబోధించినప్పటికీ.. ఎక్కడా తన కుమార్తె అని పేర్కొనకపోవడంతో అనుమానాలు వ్యక్తమౌవుతున్నాయి. ఆ చిన్నారి అతడి కుమార్తె అయి ఉండదని అంటున్నారు. మీడియా సంస్థల్లో అత్యధికం చనిపోయిన చిన్నారి మిల్లర్‌ కుమార్తెగానే చెబుతుండగా.. మరికొన్ని మాత్రం అతడికి బాగా దగ్గరైన అభిమాని అంటున్నారు. మిల్లర్‌ కూడా తమ మధ్య బంధాన్ని వెల్లడించకపోవడంతో.. ఆ చిన్నారి ఎవరన్న విషయం మిస్టరీగానే మారింది.

Read more RELATED
Recommended to you

Latest news