హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్ నిర్మాణం.. ఎక్కడంటే?

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులను నిర్మించింది. వీటితో చాలా వరకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. అయినా నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య అలానే ఉంటోంది. దీంతో కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మరో ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫ్లైఓవర్
ఫ్లైఓవర్

కూకట్‌పల్లి నియోజకవర్గం కైత్లాపూర్‌లో నిర్మించిన రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓడీ)ని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. అలాగే హైటెక్ సిటీ-బోరబండ రైల్వే స్టేషన్ మధ్య మరో ఆర్ఓడీని నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ వల్ల హైటెక్ సిటీ, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్య తీరనుంది. సికింద్రాబాద్, బాలానగర్, సనత్‌నగర్, కూకట్‌పల్లి వెనుక వైపు నుంచి హైటెక్‌ సిటీ వెళ్లే వారు కైత్లాపూర్ బ్రిడ్జి నుంచి మాదాపూర్ వైపు సులభంగా వెళ్లవచ్చు. ఈ బ్రిడ్జి పొడవు 675.50 మీటర్లు, వెడల్పు 16.6, 5.5 మీటర్ల సర్వీస్ లైన్ ఉంటుంది.