విజిల్ వేస్తున్న రామ్ పోతినేని, కృతిశెట్టి..‘ద వారియర్’ నుంచి మరో సాంగ్ విడుదల

-

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘‘ ది వారియర్’’. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ లింగు స్వామి తెరకెక్కిస్తున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా, శ్రీనివాసా చిట్టూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్ వచ్చే నెల 14న విడుదల కానుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. తాజాగా ఈ సినిమాలోని మూడో సాంగ్ ‘విజిల్..విజిల్’’ విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ వీడియోలో ‘విజిలు..విజిలు..విజిలెయ్’ అనే లిరిక్స్ కు తగ్గట్లు కృతిశెట్టి, రామ్ పోతినేని విజిల్ వేస్తూ డ్యాన్స్ చేశారు. ఈ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ కాగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

‘ఉప్పెన’ ఫేమ్ కృతిశెట్టి పర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో చాలా చక్కగా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ ఫేమ్ నదియా..ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో నదియా చాలా శక్తిమంతమైన మహిళగా కనిపించింది. ఇక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్యగా..రామ్ పోతినేని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని సమచారం.

Read more RELATED
Recommended to you

Latest news