మహారాష్ట్ర రాజకీయంలో మరో మలుపు.. రెబల్స్ ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చ!

-

మహారాష్ట్రలో రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. ఈ మేరకు బీజేపీ కూడా మహారాష్ట్రలో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా అందుబాటులోకి ఉండాలని బీజేపీ ఆదేశాలు ఇచ్చింది. కాగా, ప్రస్తుతం సుప్రీంకోర్టులో షిండే వర్గం ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ దొరికింది. దీంతో బీజేపీ మరింత వేగంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది.

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు

కాగా, ఈ రోజు గవర్నర్‌ను కలిసి ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని షిండే వర్గం కోరనుంది. తనకు 51 మంది ఎమ్మెల్యేల బలం ఉందని షిండే చెబుతున్నారు. బల నిరూపణకు గవర్నర్ కోష్యారి అవకాశమిస్తే రెబల్ ఎమ్మెల్యేలు ముంబైకి వస్తామంటున్నారు. అయితే మరికాసేపట్లో సీఎం ఉద్ధవ్ ఠాక్రే మంత్రులతో సమావేశం కానున్నారు. బల నిరూపణకు గవర్నర్ అవకాశమిస్తే ఏం చేయాలనే విషయంపై ప్లాన్ చేయనున్నారు. అలాగే రాజకీయ నిపుణుల అభిప్రాయాలు తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version