NANI : ”అంటే సుందరానికి” నుంచి అదిరిపోయే టీజర్

-

ప్రస్తుతం టాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు న్యాచురల్‌ స్టార్‌ నాని. గత ఏడాది డిసెంబర్‌ 24 వ తేదీన విడుదల అయిన… శ్యామ్‌ సింగరాయ్‌ కు కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో.. నాని క్రేజ్‌ మరింత పెరిగింది. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం నాని చేస్తున్న మరో సినిమా “అంటే సుందరానికి”.

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో… అంటే సుందరానికి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్‌ నటి నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో వస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది.

ఈ సినిమా నుంచి బర్త్ డే హోమం పేరుతో ఓ టీజర్ ను వదిలింది చిత్ర బృందం. ఈ టీజర్ లో హోమం చేస్తూ నాని అలరించారు. అలాగే “అంటే సుందరానికి” మూవీని జూన్ 10 వ తేదీన థియేటర్ల లలో విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ రెండు అప్డేట్లతో… నాని ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news