ప్రగతి భవన్ కు వెళ్లాలంటే Visa కావాల్సిందే – బూర నర్సయ్య గౌడ్

-

ప్రగతి భవన్ కు వెళ్లాలంటే Visa కావాల్సిందేనంటూ కేసీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ లో నిరంకుశ పాలన కొనసాగుతుందని.. నేను బిజెపి లో చేరడం ఘర్ వాపసి గా భావిస్తున్నానని తెలిపారు. బిజెపి ఉద్యమ కారుల పార్టీ గా మారింది… TRS ఉద్యమ ద్రోహుల పార్టీ గా మారిందని నిప్పులు చెరిగారు.

తెలంగాణ లో ఇలాంటి పాలన ను ఊహించలేదని..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కన్న కఠిన నిర్బంధాలు ఇక్కడ కొనసాగుతున్నాయని కేసీఆర్‌ ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ఉద్యమ కారులు బిజెపి లో చేరుతున్నారు అంటే అర్థం చేసుకోండని.. తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

బిజెపి తెలంగాణ లో అధికారం లోకి వస్తుందని..రాజకీయ వెట్టిచాకిరి అంతం తెలంగాణ ప్రజల పంతం… ఇదే అంశాన్ని మునుగోడు లో ప్రచారం చేస్తానని ప్రకటించారు. మునుగోడు బిజెపి గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అని.. మంత్రి మల్లారెడ్డి ని చూస్తే సిల్క్ స్మిత నే గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. అధికారులు చాలా మంది జైలు కు వెళ్తారని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news