పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క.. వరుడు ఎవరంటే..?

-

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు, హీరోయిన్లు వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గా మిగిలిపోయిన విషయం తెలిసిందే.. కానీ ఇప్పుడు ఇప్పుడే వివాహం చేసుకుంటూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోని ఎప్పుడు వివాహం చేసుకుంటుందా? అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అనుష్క అభిమానులకు ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. ఆమె పెళ్లి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈమె ఇండస్ట్రీ లోకి 17 సంవత్సరాలు పైగానే అవుతుంది.. అందంతో.. నటనతో ప్రేక్షకులను మెప్పించిన అనుష్క, లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచిపోయింది.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈమె మరింత బిజీ అయిపోతుంది అనుకుంటే.. అనుష్క మాత్రం సినీ ఇండస్ట్రీకి దూరమైందని చెప్పవచ్చు.

ఇకపోతే ఇటీవల నవీన్ పోలిశెట్టితో ఒక సినిమాలో నటిస్తోందని ఒక అప్డేట్ అయితే వచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఎటువంటి వార్త బయటకు రాకపోవడం గమనార్హం. ఇకపోతే వర్క్ లో డెడికేటెడ్ గా పనిచేసే అనుష్క 40 సంవత్సరాల వయసు దాటుతున్నా ఇంకా వివాహం చేసుకోకపోవడంతో ఎన్నో వార్తల వైరల్ అయ్యాయి. ఇక గతం లో కూడా ఈమెకు సంబంధించిన విషయంలో ప్రముఖ జ్యోతిష్యుడు పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా రంగానికి చెందనీ వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంటుందని ఆ జ్యోతిష్యుడు చెప్పాడు. అంటే ఆమె కచ్చితంగా సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తిని బయట వ్యక్తిని వివాహం చేసుకోబోతోందని సమాచారం.

2023 లోపు వివాహం చేసుకుంటుంది అని అతడు జ్యోతిష్యం చెప్పాడు. ఇదిలా ఉండగా తాజాగా అనుష్కకు పెళ్లి ఖరారు అయిందని , బెంగళూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్తని ఈమె వివాహం చేసుకోబోతుంది అంటూ తాజాగా ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇదే నిజమైతే అనుష్క పెళ్లి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హంగామా చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version