ఆంధ్రప్రదేశ్ లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి మూడు రాజధానులు అన్న అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. కానీ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించింది. ఇందుకు అప్పట్లో ప్రతిపక్షములో ఉన్న వైసీపీ మరియు ఇతర పార్టీలు సమ్మతించాయి. కానీ ఇప్పుడు మూడు రాజధానులను తీసుకురావడం అనే అంశంపైన ప్రస్తుతం ప్రతిపక్షములో ఉన్న టీడీపీ కోర్ట్ లో కేసు వేసింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదాకు వచ్చినా ఎందుకో త్వరితగతిన విచారణ జరగడం లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూడు రాజధానుల కేసును మే 9న సుప్రీమ్ కోర్ట్ లో జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మసనం విచారణ చేయనుంది.
మాములుగా అయితే ఈ కేసు విచారణను జులై 11 కి వాయిదా వేశారు, కానీ రాష్ట్ర ప్రభుత్వ వినతి ప్రకారం త్వరగా విచారించాలని నిర్ణయం తీసుకుంది. మరి ఈ విచారణలో ఏమైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది చూడాలి.