18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. 18 న ఉద‌యం 10 గంట‌ల నుంచి అసెంబ్లీ స‌మావేశాలు మొద‌లు కానున్నాయి. ఈ విష‌యాన్ని తెలుపుతు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ నోటీఫికేష‌న్ జారీ చేశారు. ఈ అసెంబ్లీ స‌మావేశాలు నాలుగు లేదా ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. మ‌ళ్లి ఆంధ్ర ప్ర‌దేశ్ లో త్వ‌ర‌లో నిర్వ‌హించే బోయే ఎన్నిక‌ల అనంత‌రం పూర్తి స్థాయిలో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

అలాగే వ‌చ్చే నెల మూడో వారం లో మ‌ళ్లి అసెంబ్లీ స‌మావేశాలు నిర్వహించాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ నెల 18న జ‌రిగే బీఏసీ స‌మావేశం ఉంటుంది. ఈ బీఏసీ స‌మావేశంలో అసెంబ్లీ పని దినాలు, సెల‌వులు, ప్ర‌ధాన‌ అజెండా ల పై చ‌ర్చించ‌నున్నారు. అలాగే ఈ అసెంబ్లీ స‌మావేశాల‌లో నే మండ‌లి ఛైర్మెన్, వైస్ ఛైర్మెన్ ల‌ను కూడా ఎన్నుకునే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ సారి అసెంబ్లి స‌మావేశాలు వాడీ వేడి గా సాగే అవకాశం ఉంది. ఇటీవ‌ల టీడీపీ జాతీయ కార్యల‌యం పై దాడి జ‌రిగింది. దీని పై చ‌ర్చించాల‌ని టీడీపీ ఎమ్మెల్యే లు ప‌ట్టు ప‌ట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news