ప్రత్యేక హోదాపై స్పందించిన జీవీఎల్…. కేంద్రం నిధులతోనే ఏపీ అభివృద్ధి

-

విభజన సమస్యలపై ఈనెల 17న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర ప్రభుత్వ చర్చించనుంది. ముందుగా అనుకున్న ప్రకారం ప్రత్యేక హోదా కూడా ఎజెండాలో చేర్చారు. అయితే తరువాత ఎజెండా నుంచి తొలగించారు.

ఇదిలా ఉంటే బీజేపీ నేత ఎంపీ జీవీఎల్ ప్రత్యేక హోదా గురించి స్పందించారు. ఏపీలో ప్రత్యేక హోదాకు మించి కేంద్రం సహాయం చేస్తుందని అన్నారు. హోదాతో సంబంధం లేకుండా వేల కోట్ల రూపాయలను ఏపీకి కేంద్ర ఇస్తుందని జీవీఎల్ అన్నారు. కేంద్రం నిధులతోనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాజధాని కేంద్రం పరిధిలోని అంశం కాదని వ్యాఖ్యానించారు.

రెవెన్యూ  డెఫిషిట్ గ్రాంట్ కింద కేవలం ఏపీకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని అన్నారు. ఇలా తెలంగాణ, తమిళనాడుకు కావని గుర్తు చేశారు. కేవలం ప్రత్యేక నిధులుగా కేంద్రం ఇస్తోందని.. కావాలంటే స్పెషల్ స్టేటస్ నిధులుగా చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. ఏపీలో ఆదాయం, ఖర్చుకు వ్యత్యాసం ఎక్కువగా ఉంది కాబట్టే కేంద్రం నిధులను ఇస్తుందని జీవీఎల్ అన్నారు. కేంద్రం ఏపీకి ఏమీ చేయడం లేదనే వారు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news