సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే… టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నిర్ణయం

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు పుట్టిన ఫిబ్రవరి 17 వ తేదీన జరుగనుంది. ఈ ఏడాదితో 68 వ ఏటలో సీఎం కేసీఆర్‌ అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రదాత మన కేసీఆర్ జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించుకుందామని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్ర కేటీఆర్‌ పిలుపు నిచ్చారు.

ఈ సారి మూడు రోజులపాటు కేసీఆర్ జన్మదిన సంబరాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
15,16,17 తేదీల్లో సేవా కార్యక్రమాలకు కేటీఆర్ పిలుపు నిచ్చారు.

మూడు రోజులపాటు పార్టీ శ్రేణులు నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలు:
ఈనెల 15వ తేదీ- రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు
(ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు)
– 16 తేదీ – అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు
– 17 తేదీ కెసిఆర్ జన్మదినం రోజున రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు

Read more RELATED
Recommended to you

Latest news