ఏపీ ప్రజలకు షాక్..రూ.9 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర అప్పు !

-

ఏపీ ప్రజలకు షాక్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అప్పు.. ఏకంగా రూ.9 లక్షల కోట్లు దాటింది. ఆంధ్రప్రదేశ్ అప్పులు చెల్లించే పరిస్థితి లేక చేబదుల్ల మీద రోజులు నెట్టుకొస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆదనపు రుణాలకు అనుమతిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చేజేతులా నాశనం చేసిన వారవుతారని ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఆర్థిక శాఖకు సూచించారు.

ఈ మేరకు ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ కు ఆరు పేజీల లేఖ రాశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి రూ. 46 వేల కోట్ల అప్పు తెచ్చుకోవడానికి ఏపీకి ఇప్పటికే అనుమతి ఇచ్చారు. నాబార్డు, విదేశీ రుణాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ అప్పులకు ఇది ఆధనం. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా తీసుకున్న రుణం రూ.9,03,436.58 కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర జిఎస్డిపిలో 75% కి సమానం.

Read more RELATED
Recommended to you

Latest news