పీఆర్సీ విషయంలో మేం హ్యాపీగా లేమని..జస్టిస్ ఫర్ పీఆర్సీ పేరుతో ఏపీ సీఎం జగన్ కు ఉద్యోగ ,ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు లేఖ రాశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఫర్ పీఆర్సీ ఫోరమ్ చీఫ్ జోసఫ్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. 11 పిఆర్సీ ప్రకటనను మేం విభేదించి బయటకు వచ్చామని.. 2 లక్షల పై చిలుకు ఉద్యోగుల అభిప్రాయాన్ని సేకరించి సీఎం ఆఫీసుకు పంపామని వెల్లడించారు. బాలట్ ద్వారా అభిప్రాయాన్ని సేకరించామని.. పీఆర్సీ విషయంలో ఎవ్వరు హ్యాపీగా లేరన్నారు.
మా వాదన సీఎంకు వినిపించే అవకాశం సీఎంఓ అధికారులు, సీఎస్ కల్పించలేదు.. అందుకే బహిరంగ లేఖ విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని… జీవోలతో పాటు అశుతోష్ మిశ్రా నివేదిక ఎందుకు ఇవ్వడం లేదు..? అని నిలదీశారు. త్వరలో శాసనసభ సమావేశం అంటున్నారు.. సీపీఎస్ రద్దుకు రాజస్థాన్ ప్రభుత్వం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. మా సమస్యలు పరిష్కరించక పోతే ఎమ్మెల్సీల మద్దతు తో నిరసన దీక్ష నిర్వహిస్తామని.. రికవరీ జివో, 5 ఏళ్లకు పీఆర్సీ అనే జీవోలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. .