నారా లోకేశ్ చుట్టు బిగస్తున్న ఉచ్చు..?

-

టీడీపీ భావినేతగా నారా లోకేశ్ ఉన్న సంగతి అందరికీ విదితమే. ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. టీడీపీని బలోపేతం చేసే మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీసీ నేతలు లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేస్తున్నారు. కాగా, లోకేశ్ రాజకీయాలకు బ్రేక్ పడనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేశ్ మంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణం వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై లోకేశ్ స్పందిస్తూ ఆధారాలు చూపించాలంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఫైబర్ నెట్ కుంభకోణంలో పాత్ర ఉన్నవాళ్లను అరెస్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. దాంతో లోకేశ్ ఇక సైలెంట్ అయ్యే చాన్సెస్ ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు.

అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా లోకేశ్ ఉన్న సమయంలోనే ఆయన కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టును టెరా సాఫ్ట్ అనే కంపెనీకి అర్హత లేకున్నా నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు ఇచ్చారని తెలుస్తోంది. ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టు విషయమై సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. ఇందులో రూ.330 కోట్ల మేర అవినీతి జరిగిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సీఐడీ పోలీసులు ఆల్రెడీ 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో భాగంగా ఏ2 స్థానంలో ఉన్న సదరు కంపెనీ ఎండీ సాంబశివరావును అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఈ కేసు చివరకు నారా లోకేశ్ మెడకు చుట్టుకోవడం ఖాయమనే పలువురు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి.. రాబోయే రోజుల్లో ఫైబర్ నెట్ కుంభకోణం టీడీపీని, లోకేశ్‌ను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో..

Read more RELATED
Recommended to you

Exit mobile version