Breaking : ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. స్పెషల్ పే పెంపు

-

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. వివిధ కేటగిరీల ఉద్యోగులకు ‘స్పెషల్ పే’ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు G.O.Ms.79 ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చర్చల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. అయితే అంతకుముందు ఏపీలోని ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల కోసం ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు శుభవార్త ప్రభుత్వం తెలపడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఉద్యోగుల స్పెషల్ పే కి సంబంధించి 11 వ సిఫార్సులు యధాతథంగా అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఒకటి రెండు కేటగిరీల ఉద్యోగులకు తప్ప.. మిగతా కేటగిరీల ఉద్యోగులందరికీ స్పెషల్ పే అందనుంది. ఈ స్పెషల్ పే 30 నుంచి 33 శాతం పెరుగుదలకు అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం స్పెషల్ పే పెంచినందుకు గాను ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version