తెలంగాణతో జలవివాదం.. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం!

-

అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాతూనే ఉంది. నేతల మధ్య మాటల యుద్ధం, కేంద్రానికి లేఖల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరేలా కనిపిస్తోంది. కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని విజ్ఞప్తి చేయబోతోంది. కేఆర్ఎంబీ విధివిధానాల ఖరారుకు కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరనుంది. రైతులు, ప్రజల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేయనుంది.

రాయలసీమ ఎత్తిపోతల పనులు ప్రారంభించడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేఆర్ఎంబీకి లేఖలు రాసింది. అటు ఏపీ ప్రభుత్వం కూడా పలు లేఖలు రాసింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇప్పుడు ఈ పంచాయితీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లబోతోంది. మరి ఏమవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news