ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

-

ఏపీ ప్రభుత్వం, ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్ల పై ఒక కీలక నిర్ణయం చేపట్టింది. ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ ఇస్తున్న వివిధ సిరీస్ ల స్ధానంలో ఇకపై ఓ కొత్త సిరీస్ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ సిరీస్ ఇవ్వనున్నట్లు తెలిపింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటివరకూ ఉన్న పాత వాహనాలకు మాత్రం మార్పు ఏమి చెయ్యడం లేదు. ఏవే సిరీస్ నంబర్లతో కొనసాగుతాయి. కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ సిరీస్ తో నంబర్లను ఇస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఏపీ 18, ఏపీ 39 ఇలా వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. అలాగే ప్రభుత్వం లీజుకు తీసుకుంటున్న ప్రైవేటు వాహనాలు సైతం వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి. వీటి స్థానంలో కొత్త సిరీస్ ను ప్రభుత్వం అమలులోకి తేనుంది.

ఏపీలో ప్రభుత్వ వెహికిల్స్కు 40జీ సిరీస్​

ప్రభుత్వం వివిధ శాఖల్లో అవసరాల కోసం నేరుగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ఏపీ 40జీ సిరీస్ నంబర్ కేటాయిస్తారు. ప్రభుత్వం ప్రైవేటు నుంచి లీజుకు తీసుకుని వాడుకునే వాహనాలకు మాత్రం ఇది వర్తించదు. ఈ నేపధ్యం లో ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజుల సమయం ఇచ్చారు. తమిళనాడులో జీ(గవర్నమెంట్) సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news